భారతదేశం, మార్చి 30 -- వివో వీ50ఈ స్మార్ట్​ఫోన్​ భారత్​లో లాంచ్​కు రెడీ అవుతోంది. ఈ ఫోన్ ఇప్పటికే బీఐఎస్ సర్టిఫికేషన్ సైట్​లో కనిపించింది. ఇటీవలి రెండర్లు దాని పూర్తి డిజైన్​ని వెల్లడించాయి. కెమెరా సామర్థ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఈ స్మార్ట్​ఫోన్ భారత మార్కెట్ కోసం రూపొందించిన ఇండియా-ఎక్స్​క్లూజివ్ వెడ్డింగ్ పోర్ట్రెయిట్ స్టూడియో ఆప్షన్​ను కలిగి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్​ఫోన్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మైస్మార్ట్ ప్రైస్ నివేదిక ప్రకారం.. వివో వీ50ఈ స్మార్ట్​ఫోన్​ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)ను సపోర్ట్ చేసే 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సార్​తో వస్తుంది. కెమెరాలో సోనీ మల్టీఫోకల్ పోర్ట్రెయిట్స్ 1x, 1.5x, 2x ఫోకల్ లెంగ్త్​లు కూడా ఉంటాయి. ప్రైమరీ కెమెరాతో పాటు ఇండియా ఎక్స్​క్లూజివ్​ వెడ్డింగ్ పోర్ట్ర...