భారతదేశం, మార్చి 8 -- వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కీలక సాక్షులు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. ఈ మరణాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ ఇష్యూపై ఇప్పటికే సిట్‌ఏర్పాటు చేసింది. మరణించిన ఆరుగురు సాక్షులకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేకపోయినా.. వారంతా అనారోగ్యంతోనే చనిపోయారని చెబుతున్నారు. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది.

వివేకా హత్య కేసులో కీలక సాక్షి, వాచ్‌మన్‌ రంగన్నది కూడా అనుమానాస్పద మరణమేనని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే 7వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశానికి డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాను పిలిచించారు. పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ మధ్య కాలంలో డీజీపీని కేబినెట్ సమావేశానికి పిలవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

రాజకీయం ముసుగులో కరడుగట్టిన నేర...