భారతదేశం, ఫిబ్రవరి 7 -- అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై ఆదివాసీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. 1/70 చట్టాన్ని సడలించాలని అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై ఆదివాసీలు గుర్రున ఉన్నారు. ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ.. ఏజెన్సీ ప్రాంతం బంద్‌కు సిద్ధమయ్యారు. ఈనెల 11, 12 తేదీల్లో 48 గంటల పాటు నిరవధిక ఏజెన్సీ బంద్ నిర్వహించనున్నాట్లు ఆదివాసీ నేతలు ప్రకటించారు.
ఆదివాసీ సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు కూడా ఈ బంద్‌లో పాల్గొననున్నాయి. ఇప్పటికే వైసీపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, బీఎస్పీ రాజకీయ పార్టీలతో పాటు.. గిరిజన సంఘం, గిరిజన ఉద్యోగుల సంఘం, మహిళ సంఘాలు, ఆదివాసీ జేఏసీ, ఆదివాసీ సంఘాలు బంద్‌కు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ఈ బంద్ ఏజెన్సీ ప్రాంతమైన మన్యం పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లా, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.