భారతదేశం, ఫిబ్రవరి 7 -- అసెంబ్లీ స్పీక‌ర్ అయ్య‌న్నపాత్రుడు కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆయ‌న‌పై ఆదివాసీ నేత‌లు ఆగ్ర‌హంగా ఉన్నారు. 1/70 చ‌ట్టాన్ని స‌డ‌లించాల‌ని అయ్య‌న్నపాత్రుడు చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆదివాసీలు గుర్రున ఉన్నారు. ఆ వ్యాఖ్య‌ల‌ను నిర‌సిస్తూ.. ఏజెన్సీ ప్రాంతం బంద్‌కు సిద్ధ‌మ‌య్యారు. ఈనెల 11, 12 తేదీల్లో 48 గంట‌ల పాటు నిర‌వ‌ధిక‌ ఏజెన్సీ బంద్ నిర్వ‌హించ‌నున్నాట్లు ఆదివాసీ నేతలు ప్ర‌క‌టించారు.

ఆదివాసీ సంఘాల‌తో పాటు రాజ‌కీయ పార్టీలు కూడా ఈ బంద్‌లో పాల్గొన‌నున్నాయి. ఇప్ప‌టికే వైసీపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌, బీఎస్పీ రాజ‌కీయ పార్టీల‌తో పాటు.. గిరిజ‌న సంఘం, గిరిజ‌న ఉద్యోగుల సంఘం, మ‌హిళ సంఘాలు, ఆదివాసీ జేఏసీ, ఆదివాసీ సంఘాలు బంద్‌కు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ఈ బంద్ ఏజెన్సీ ప్రాంత‌మైన‌ మ‌న్యం పార్వ‌తీపురం, అల్లూరు సీతారామ‌రాజు జిల్లా, ...