భారతదేశం, మార్చి 5 -- Visakha Lands: వైసీపీ హయంలో అమ్మలేకపోయిన భూముల్ని కూటమి ప్రభుత్వంలో విక్రయించేందుకు కొందరు పావులు కదుపుతున్నారు. గతంలో ప్రభుత్వ భూముల్ని విక్రయించడంపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో నాటి ప్రభుత్వం వెనక్కి తగ్గగా ఇప్పుడు అవే భూముల్ని విక్రయించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ వ్యవహారంపై ఫైల్ ను ఆగమేఘాలపై నడిపిస్తున్నారు.
విశాఖలో రూ.700కోట్ల ఖరీదు చేసే భూముల్ని పదో వంతు ధరకే విక్రయించే ప్రయత్నాలు మొదలయ్యాయి.ఖరీదైన ప్రభుత్వ భూముల్ని కారు చౌకగా విక్రయించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. కీలక మంత్రి పేషీలో ఉన్న అధికారి అండదండలతో ఈ వ్యవహారం సాగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. భూముల విక్రయానికి సంబంధించిన ఫైల్ సిద్ధమై సర్క్యూలేషన్లో పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో విశాఖపట్నంలో బెంగుళూరుకు చెందిన ఇంటర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.