భారతదేశం, జూన్ 2 -- Maharashtra road Viral video : దేశంలో అధికారుల నిర్లక్ష్యం, రోడ్ల దుస్థితికి అద్దం పట్టే మరో ఘటన ఇది! ఏదో.. నేల మీద పడి ఉన్న కార్పెట్​ను పైకి లేపుతున్నంత సులభంగా.. కొందరు ప్రజలు రోడ్డును లేపేశారు. పైగా.. అది కొత్తగా వేసిన రోడ్డు కావడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

సంబంధిత వీడియో.. మహారాష్ట్రకు చెందినదిగా నెటిజన్లు చెబుతున్నారు. వీడియోలో కొందరు మనుషులు ఉన్నారు. కొత్తగా వేసిన రోడ్డు వద్ద నిలబడ్డారు. అనంతరం రోడ్డు కింద వేసిన కార్పెట్​ లాంటి మెటీరియల్​ను చేతులతో ఎత్తి పైకి లేపి పట్టున్నారు! ఆ తర్వాత అధికారులపై మండిపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్​ పేరు రానా థాకూర్​ అని చెబుతూ.. కొత్త రోడ్డు ఒక బోగస్​ అని ఆరోపించారు.

పలు మీడియా కథనాల ప్రకారం.. ఈ ఘటన మహారాష్ట్రలోని జల్...