భారతదేశం, ఫిబ్రవరి 23 -- Vidrohi Movie: టాలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ ర‌వి ప్ర‌కాష్ పేరు చెప్ప‌గానే పోలీస్ పాత్ర‌లే గుర్తొస్తాయి. సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎక్కువ‌గా ఖాకీ డ్రెస్‌లోనే క‌నిపించాడు. మ‌రోసారి పోలీస్ పాత్ర‌లో ర‌విప్ర‌కాష్ న‌టిస్తోన్న మూవీ విద్రోహి. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో శివకుమార్, చరిష్మా శ్రీకర్, సాయికి ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు వీఎస్ వీ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో శ్రీకాంత్ విద్రోహి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ - విద్రోహి సినిమాలో రవి ప్రకాష్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. అత‌డు నాకు మంచి మిత్రుడు. టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్. ఈ సినిమా స్టోరీ నాకు తెలుసు. ర‌విప్ర‌కాష్ కెరీర్‌లో డిఫ‌రెంట్ మూవీగా నిలుస్తుంద‌నే న‌మ్మ‌క‌ముంది" అని అన్నారు...