భారతదేశం, మార్చి 23 -- ఏసీబీ కేసుపై మాజీ మంత్రి విడదల రజిని స్పందించారు. కూటమి ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని ఆరోపించారు. ఆధారాలు లేకుండా కేసులు పెడుతోందని వ్యాఖ్యానించారు. బీసీ మహిళ రాజకీయంగా ఎదగడాన్ని తట్టుకోలేకపోతున్నారన్న రజిని.. అక్రమ కేసులకు భయపడను, న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు.

వైసీపీ పాలనలో మైనింగ్ వ్యాపారిని బెదిరించి 2.20 కోట్ల రూపాయలు వసూలు చేసిన వ్యవహారంలో.. మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజినిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. పల్నాడు జిల్లాలోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్‌ క్రషర్‌ యజమానిని విజిలెన్స్‌ తనిఖీల పేరుతో బెదిరించారని, డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదు రావడంతో.. ఏసీబీ రంగంలోకి దిగింది. ఆమెతో పాటు నాటి గుంటూరు ఆర్వీఈవో, ఐపీఎస్‌ అధికారి పల్లె జాషువా సహా మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.

ఐపీఎస్ అధికారి జాషువాప...