భారతదేశం, ఫిబ్రవరి 14 -- ప్రతి నెల కూడా ఏదో ఒక గ్రహ సంచారంలో మార్పు చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు రెండు, మూడు గ్రహాల కలయిక కూడా జరుగుతుందని చూస్తూ ఉంటాం. మార్చి నెల కూడా రాబోతోంది. 2026 మార్చి నెలలో కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు రావడంతో కొన్ని సంయోగాలు ఏర్పడతాయి. శుక్రుడు, సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించడంతో శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది.

అలాగే శని, సూర్య, శుక్రుల మధ్య కూడా శక్తివంతమైన సంయోగం ఏర్పడబోతోంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసినట్లయితే ఈ సంయోగాలు ముఖ్యమైన మార్పులను తీసుకువస్తాయి. మార్చి నెలలో సూర్య, శని, శుక్రుల సంయోగం మీన రాశిలో జరగబోతోంది. ఇది కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది.

2026 మార్చి 2న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మార్చి 15న సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే మీనరాశిలో శని సంచారం జరుగు...