భారతదేశం, ఫిబ్రవరి 14 -- ఎప్పటికప్పుడు గ్రహాలు రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాలు ఇలా రాశి మార్పు చెందినప్పుడు శుభయోగాలు, అశుభ యోగాలను చూస్తూ ఉంటాము. కొన్ని సార్లు కొన్ని గ్రహాల సంయోగం కూడా ఏర్పడుతూ ఉంటుంది. దీంతో యోగాలు ఏర్పడతాయి. అవి 12 రాశుల వారి జీవితంలో మార్పులను తీసుకొస్తాయి. కొన్ని సార్లు శుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పంచాంగం ప్రకారం చూసినట్లయితే మార్చి 2న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశికి అధిపతి గురువు. మార్చి 26 వరకు అదే రాశిలో సంచారం చేస్తాడు. ఆ తర్వాత మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇదిలా ఉంటే మార్చి 18న చంద్రుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో శుక్ర, చంద్రుల కలయిక ఏర్పడుతుంది.

ఇది మార్చి 21 వరకు ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఊహించని విధంగా లాభాలను పొందుతారు. సంతోషంగా ఉంటారు. అదృష్టం కూడా వెతుక్కుంటూ వస్తుంది....