భారతదేశం, ఫిబ్రవరి 2 -- రోడ్లపై ఇన్సూరెన్స్ లేని వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. చాలా మంది వెహికల్ ఇన్సూరెన్స్‌ను లైట్ తీసుకుంటున్నారు. వాహన యజమానులు ప్రమాదంలో పడటమే కాకుండా రోడ్డు ప్రమాదాల బాధితులకు కూడా సరైన పరిహారం అందడం లేదు. ఇప్పుడు ఈ సమస్యను తొలగించేందుకు ఒడిశా స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. 2025 ఫిబ్రవరి 1 నుంచి ఒడిశాలోని 22 టోల్‌గేట్ల్ వద్ద ఈ-డిటెక్షన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ఇది బీమా లేని వాహనాలను గుర్తించి ఆటోమేటిక్‌గా ఈ-చలాన్లు జారీ చేస్తుందని అధికారులు తెలిపారు.

టోల్ గేట్ల వద్ద ఏర్పాటు చేసిన ఈ-డిటెక్షన్ వ్యవస్థలు వెంటనే వాహనాల బీమా చెల్లుబాటును చెక్ చేస్తాయి. ఇన్సూరెన్స్ లేకుండా వాహనం కనిపిస్తే తొలిసారి రూ.2,000 చలానా విధిస్తారు. మళ్లీ అదే వాహనం పట్టుబడితే రూ.4 వేల చలానా వేస్త...