భారతదేశం, మార్చి 11 -- ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ కమిషనర్ లలిత్ మోదీకి బిగ్​ షాక్​! భారత పాస్​పోర్ట్​ని వదులుకోవాలని నిర్ణయించుకుని, ఆయన పొందిన విలాసవంతమైన వనాటు పాస్​పోర్ట్​ని రద్దు చేయాలని ఆ దేశ ప్రధాని జోతం నపత్.. పౌరసత్వ కమిషన్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అసలు 'వనాటు' అంటే ఏంటి? అది ఎక్కడుంది? ఈ ప్రాంతానికి ఎందుకింత క్రేజ్​? అని సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ వివరాలు..

దక్షిణ పసిఫిక్​లోని ద్వీప దేశం: వనాటు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని 83 ద్వీపాల ద్వీపసమూహం. వీటిల్లో 65 చోట్ల నివాసాలు ఉన్నాయి. వనాటును ఒకప్పుడు న్యూ హెబ్రిడ్స్ అని పిలిచేవారు. ఈ పేరును బ్రిటిష్ అన్వేషకుడు జేమ్స్ కుక్ 1774లో ఇచ్చారు. ఈ దేశం అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ వనాటు.

భూభాగం- జనాభా: వనాటు 12,199 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కలిగి ఉంది. ఇందులోని ఎ...