భారతదేశం, ఫిబ్రవరి 14 -- ప్రేమకు సరిహద్దులు లేవు! కులమతాలతో పనిలేదు! సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ ఈ విషయాన్ని నిరూపించిన వారెందరో ఉన్నారు. మరీ ముఖ్యంగా పలువురు భారత రాజకీయ నాయకులు.. విదేశీ వనితలను ప్రేమించి, వివాహం చేసుకుని, భిన్న సంస్కృతులను ఇండియాలో మమేకం చేశారు. ఈ వాలెంటైన్స్​ డే 2026 రోజున.. ప్రముఖ రాజకీయ నేతల ప్రేమకథల గురించి ఇక్కడ తెలుసుకోండి..

1. రాజీవ్ గాంధీ - సోనియా గాంధీ

విదేశీ 'ప్రేమ' అంటే ముందుగా గుర్తొచ్చే జంట.. రాజీవ్​ గాంధీ- సోనియా గాంధీ! వీరిద్దరిది ఒక అద్భుతమైన ప్రేమకథ అని చెబుతుంటారు. భారత 6వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ రాజకీయ కుటుంబం నుంచి రాగా, సోనియా ఇటలీలోని రోమన్ కాథలిక్ కుటుంబానికి చెందినవారు.

పరిచయం: వీరిద్దరూ ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో చదువుకుంటున్నప్పుడు కలుసుకున్నారు. తొలిచూపులోనే రాజీవ్ ప్రేమలో పడ్డా...