భారతదేశం, ఫిబ్రవరి 15 -- డొనాల్డ్​ ట్రంప్​ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి రోజుకో సంచలనం సృష్టిస్తున్నారు. అక్రమ వలసలు, టారీఫ్​ యుద్ధంతో ప్రపంచ దేశాలకు షాక్​ ఇస్తున్న ఆయన.. ఇప్పుడు సొంత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు కనిపిస్తోంది. దిగ్గజ వ్యాపారవేత్త, డాడ్జ్​ (డిపార్ట్​మెంట్​ ఆఫ్​ గవర్న్​మెంట్​ ఎఫీషియెన్సీ) హెడ్​ ఎలాన్​ మస్క్​తో కలిసి ఫెడరల్​ వర్క్​ఫోర్స్​ని అమాంతం తగ్గించేందుకు ట్రంప్​ చర్యలు చేపట్టారు. ఫలితంగా అమెరికావ్యాప్తంగా వివిధ ఫెడరల్​ డిపార్ట్​మెంట్స్​లో ప్రభుత్వ ఉద్యోగులు.. కనీవినీ ఎరుగని రీతిలో లేఆఫ్స్​ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 75వేల మంది.. ఉద్యోగాల నుంచి తప్పుకున్నట్టు, మరో 19లక్షల మందిపై ఏ క్షణంలోనైనా 'లేఆఫ్​' పిడుగు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్​బర్గ్​ రిపోర్టు ప...