భారతదేశం, మార్చి 21 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు! ఈసారి.. ఏకంగా అమెరికన్​ ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్​ మొత్తాన్నే మూసేశారు. ఈ మేరకు విద్యాశాఖను 'డిస్మాంటిల్​' చేసేందుకు గురువారం ఎగ్జిక్యూటివ్​ ఆర్డర్లపై సంతకం చేశారు.

అమెరికా విద్యాశాఖ తొలగింపు అనేది ట్రంప్​ ఎన్నికల వాగ్దానాల్లో ఒకటి. అంతేకాదు, యూఎస్​ ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్​ని రద్దు చేయాలని అమెరికాలోని కన్జర్వేటివ్​లు ఎన్నో ఏళ్లుగా డిమాండ్​ చేస్తున్నారు.

'45 ఏళ్ల చరిత్రాత్మక చర్యను ఈ రోజు తీసుకున్నాం. ఫెడరల్ డిపార్ట్​మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్​ని శాశ్వతంగా తొలగించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశాను. అది కరెక్ట్ అని డెమొక్రాట్లకూ తెలుసు. అంతిమంగా అది వారి ముందుకు రావచ్చు కాబట్టి వారు దీనికి ఓటు వేస్తారని నేను ఆశిస్తున్నాను," అని ట్రంప్ అన్నారు....