భారతదేశం, ఏప్రిల్ 9 -- Urinating on co-passenger: ఢిల్లీ-బ్యాంకాక్ ఎయిరిండియా విమానంలో ఓ భారతీయ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనను ధృవీకరిస్తూ విమానయాన సంస్థ ఎయిరిండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటన జరిగిన తర్వాత సిబ్బంది డీజీసీఏ నిర్దేశించిన అన్ని విధివిధానాలను పాటించారని తెలిపింది.

2025 ఏప్రిల్ 9న ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఏఐ2336 విమానంలో ఒక ప్యాసెంజర్ తన సహ ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనను ఎయిరిండియా ధృవీకరించింది. సిబ్బంది అన్ని విధివిధానాలను పాటించారని, ఈ విషయాన్ని అధికారులకు నివేదించామని తెలిపింది. నిందితుడైన ప్రయాణికుడిని సిబ్బంది హెచ్చరించారని, ఈ సంఘటనకు గురైన బాధితుడు ప్రముఖ బహుళజాతి కంపెనీ ఉద్యోగి అని వెల్లడించింది. బాధితుడు తన ఫిర్యా...