భారతదేశం, సెప్టెంబర్ 12 -- ప్రముఖ హోమ్ సర్వీసెస్ సంస్థ అర్బన్ కంపెనీ లిమిటెడ్ తన ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ను సెప్టెంబర్ 10న ప్రారంభించింది. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌కు సెప్టెంబర్ 12 (నేడే) చివరి తేదీ. అంటే పెట్టుబడిదారులు దరఖాస్తు చేసుకోవడానికి కేవలం ఈరోజు మాత్రమే సమయం ఉంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 1,900 కోట్లు సమకూర్చడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ. 472 కోట్లు కొత్త షేర్ల జారీ ద్వారా, మిగిలిన రూ. 1,428 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్​) ద్వారా సేకరిస్తారు. అర్బన్ కంపెనీ ఐపీఓకు ఇప్పటికే మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో అర్బన్​ కంపెనీ ఐపీఓ జీఎంపీతో పాటు అప్లై చేసుకోవచ్చా? లేదా? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం కాకముందే, అర్బన్ కంపెనీ ఐపీఓ గ్రే మార్కెట్‌లో సందడి మొదలైంది. స్టాక్ మార్కెట్ నిపుణుల ప్ర...