భారతదేశం, ఏప్రిల్ 12 -- యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్​ఫేస్​లో మళ్లీ అంతరాయం ఏర్పడింది. ఫలితంగా పేటీఎం, ఫోన్​పే, గూగుల్ పే వంటి ప్రసిద్ధ యాప్స్​పై ఈ ప్రభావితం భారీగా పడింది. దేశవ్యాప్తంగా వేలాది మంది యూపీఐ యాప్స్​ ద్వారా లావాదేవీలు చేయలేకపోయారు. చెల్లింపుల కోసం యూపీఐని తరచుగా ఉపయోగించే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.

ఏప్రిల్ 12 శనివారం ఉదయం 11:30 గంటలకు ఫోన్​పే, గూగుల్​పే, పేటీఎం తదితర యాప్స్​లో డిజిటల్ చెల్లింపులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ట్రాకింగ్ ప్లాట్​ఫామ్​ డౌన్​డిటెక్టర్ సైతం ధ్రువీకరించింది. 76 శాతం మంది వినియోగదారులు చెల్లింపులకు సంబంధించి సమస్యలను ఎదుర్కొన్నారని, 23 శాతం మంది నిధులను బదిలీ చేయలేకపోయారని డౌన్​డిటెక్టర్ చూపించింది.

యూపీఐ సేవలకు తాజా అంతరాయానికి గల కారణాలు ఇంకా తెల...