భారతదేశం, ఫిబ్రవరి 23 -- Telugu Serials: బుల్లితెర ప్రేక్ష‌కులను అల‌రించేందుకు మ‌రికొన్ని కొత్త సీరియ‌ల్స్ సిద్ధ‌మ‌వుతున్నాయి. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో కూడిన ఈ కొత్త‌ సీరియ‌ల్స్ త్వ‌ర‌లోనే టీవీల్లో సంద‌డి చేయ‌నున్నాయి. ఇప్ప‌టికే కొన్ని సీరియ‌ల్స్ లాంఛింగ్ డేట్ ఆయా ఛానెల్స్ క‌న్ఫామ్ చేశారు. స్టార్ మా, జీ తెలుగుతో పాటు ఇత‌ర ఛానెల్స్‌లో టెలికాస్ట్ కాబోతున్న ఆ కొత్త సీరియ‌ల్స్ ఏవంటే?

ఇటీవ‌లే స్టార్ మాలో గీత ఎల్ఎల్‌బీ, నువ్వుంటే నా జ‌త‌గా సీరియ‌ల్స్ ప్రారంభ‌మ‌య్యాయి. తాజాగా మ‌రో కొత్త సీరియ‌ల్‌తో ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేయ‌బోతున్న‌ది స్టార్ మా. టాలీవుడ్ టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ అన్న‌పూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సీరియ‌ల్‌కు భానుమ‌తి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.త‌మిళంలో సూప‌ర్ హిట్‌గా నిలిచిన చిన్న మ‌రుమ‌గ‌ల్ కు రీమేక్‌గా భానుమ‌తి సీరియ‌ల్...