భారతదేశం, మార్చి 5 -- మార్చి నెలలో కొన్ని స్మార్ట్ ఫోన్లు మార్కెట్‌లోకి రానున్నాయి. కొత్త స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ప్రత్యేకమైన గాడ్జెట్‌లు కూడా వస్తున్నాయి. ఈ నెలలో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను చూద్దాం.. ఇటీవల శాంసంగ్ ఏ సిరీస్, నథింగ్ కొత్త ఫోన్లు ప్రవేశపెట్టారు. ఇప్పుడు గూగుల్‌తో సహా చాలా పెద్ద కంపెనీలు కూడా తమ కొత్త ఫోన్‌లను తీసుకువస్తున్నాయి.

గూగుల్ ఈ నెల మార్చి 19న తన చౌకైన ఫోన్‌ను లాంచ్ చేయనుంది. దీనిని పిక్సెల్ 9ఏ పేరుతో ప్రవేశపెట్టవచ్చు. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, టెన్సర్ జీ4 చిప్, 48ఎంపీ ప్రైమరీ కెమెరా, 4,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

వివో భారతదేశంలో టీ4ఎక్స్‌ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల హెచ్‌డీప్లస్ రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావ...