భారతదేశం, మార్చి 2 -- ప్రతి వారం మార్కెట్‌లో కొత్త ఐపీఓ ఇష్యూలు వస్తాయి. దాదాపు ప్రతి వారం కొన్ని కంపెనీలు లిస్టింగ్ అయ్యే ముందు ఐపీఓలను ప్రారంభిస్తూనే ఉంటాయి. అయితే వచ్చే వారం ఒకే ఒక కొత్త ఐపీఓ రాబోతోంది. అది కూడా SME కేటగిరీలోనే ఉంటుంది.. అంటే చిన్న, మధ్య తరహా సంస్థ. అదే NAPS గ్లోబల్ ఇండియా.

NAPS గ్లోబల్ ఇండియా ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.90. రిటైల్ పెట్టుబడిదారులు కనీసం రూ.1,44,000 పెట్టుబడి పెట్టాలి. ఐపీఓ మార్చి 4న ప్రారంభమవుతుంది. ప్రతి అప్లికేషన్ లాట్ సైజు 1600 షేర్లుగా నిర్ణయించారు.

ఈ ఐపీఓ మార్చి 6న ముగుస్తుంది. మార్చి 7 నాటికి వాటాల కేటాయింపు పూర్తయ్యే అవకాశం ఉంది. మార్చి 11 నాటికి బీఎస్ఈ ఎస్ఎంఈలో లిస్ట్ చేయాలి.

ఈ ఐపీఓ రూ. 11.88 కోట్ల స్థిర విలువ గల ఇష్యూగా వస్తుంది. ఇందులో 13.20 లక్షల కొత్త షేర్లు ఉన్నాయి. ప్రమోటర్లు ప...