భారతదేశం, ఫిబ్రవరి 1 -- బడ్జెట్​ 2025లో భాగంగా విద్యా రంగంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ పలు కీలక ప్రకటనలు చేశారు. విద్య కోసం కృత్రిమ మేధస్సులో కొత్త సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్​ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తం రూ.500 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎడ్యుకేషన్​ని తీసుకొస్తున్నట్టు వివరించారు. 2023లో వ్యవసాయం, ఆరోగ్యం, సుస్థిర నగరాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​ని మూడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్​ని ప్రకటించినట్లు నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో గుర్తుచేశారు.

యువతలో కుతూహలం, ఆవిష్కరణల స్ఫూర్తిని పెంపొందించడానికి, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 50 వేల కొత్త అటల్ టింకరింగ్ ల్యాబ్​ల ఏర్పాటు.

భారత్ నెట్ ప్రాజెక్టు కింద గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ...