భారతదేశం, ఏప్రిల్ 18 -- క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టించిన అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి మూవీ ఏప్రిల్ 18న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. స‌యి మంజ్రేక‌ర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో సీనియ‌ర్ న‌టి విజ‌య‌శాంతి ఓ కీల‌క పాత్ర‌లో న‌టించింది. ప్ర‌దీప్ చిలుకూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి ప్రీమియ‌ర్స్ టాక్ ఏంటంటే?

అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి ప్రీమియ‌ర్స్‌కు మిక్స్‌డ్ టాక్ ల‌భిస్తోంది. రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ టెంప్లేట్ మూవీ ఇద‌ని, అవుట్‌డేటెడ్‌, ప్రెడిక్ట‌బుల్ స్క్రీన్‌ప్లేతో ద‌ర్శ‌కుడు ఈ మూవీని తెర‌కెక్కించాడ‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తోన్నారు.

త‌ల్లీకొడుకుల అనుబంధంతో అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి మూవీ ఇంట్రెస్టింగ్‌గా ప్రారంభ‌మ‌వుతుంద‌ని చెబుతోన్నారు. ఇర‌వై నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ మాత్రం షాకింగ్‌గా ఉంద‌ని అంటున్నారు. కంప్లీట్ డిఫ‌రెంట...