తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, జనవరి 29 -- Telangana Group 4 Recruitment 2022 Updates:తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్ 1,2,3 4 నోటిఫికేషన్లు రాగా... మరోవైపు ఇతర శాఖలోని పోస్టులు కూడా భర్తీ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. దాదాపు అన్నీ ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం కాగా... తాజాగా గ్రూప్ 4 ఉగ్యోగాలకు సంబంధించి కీలక అప్జేట్ ఇచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. గ్రూప్‌-4 కేటగిరీలో మరో 141 పోస్టుల­ను జత చేస్తూ అనుబంధ ప్రకటనను శనివా­రం విడుదల చేసింది. ఫలితంగా త గ్రూప్‌-4 కేటగి­రీలో ఉద్యోగాల సంఖ్య కాస్త 8,180కు చేరింది.

ఈ 141 పోస్టులు మహాత్మా జ్యో­తిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీలో భర్తీ చేయనున్నారు. ఇందులో బాలుర గురుకుల విద్యాసంస్థలకు సంబంధించి 86 పోస్టులుండగా, బాలికల విద్యా సంస్థలకు సంబంధించి 55 ప...