తెలంగాణ,హైదరాబాద్, ఏప్రిల్ 27 -- TS TET Exam Updates 2024 : తెలంగాణ టెట్(TS TET Exam) కు దరఖాస్తుల ప్రక్రియ పూర్తి అయిన సంగతి తెలిసిందే. మే 20వ తేదీ నుంచి పరీక్షలు కూడా ప్రారంభం అవుతాయని అధికారులు షెడ్యూల్ కూడా ప్రకటించారు. జూన్ 06వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగాల్సి ఉంటుంది. అయితే పరీక్షల షెడ్యూల్ లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. మే 27వ తేదీన తెలంగాణలోని గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ(ఖమ్మం, నల్గొండ, వరంగల్) స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఇదే తేదీన పోలింగ్ ఉంది. దీంతో ఈ రోజే జరగాల్సిన టెట్ పరీక్ష ఉంటుందా..? లేక వాయిదా షెడ్యూల్ మారుస్తారా అనేది ప్రశ్నగా మారింది.

మే 20న తెలంగాణ టెట్ పరీక్షలు(Telangana TET exam schedule) ప్రారంభమైన జూన 06వ తేదీన ముగుస్తాయి. ఈ మేరకు అధికారులు షెడ్యూల్ కూడా ప్రకటించారు. అయితే ఖమ్మ...