భారతదేశం, మార్చి 2 -- అమెరికాలోని ఓవల్ కార్యాలయంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ మధ్య శుక్రవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ చర్చ ప్రపంచవ్యాప్తంగా హాట్ హాట్‌గా మారింది. ఈ ఘటనపై రష్యా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. వ్లొదిమిర్ జెలెన్‌స్కీ చెంపదెబ్బ కొట్టకుండా జేడీ వాన్స్ తనను తాను ఎలా ఆపుకున్నారో ఆశ్చర్యం కలిగించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ విషయంపై ఆయన ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. మరోవైపు ఉక్రెయిన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

రష్యా యుద్ధాన్ని ముగించాలంటే ఉక్రెయిన్‌లోని విలువైన ఖనిజాలను తమకు అప్పగించాలని యూఎస్ పట్టుబట్టింది. భవిష్యత్తులో మరోసారి రష్యా.. దురాక్రమణకు పాల్పడితే ...