భారతదేశం, ఫిబ్రవరి 5 -- Trains Stoppage: తెలుగు రాష్ట్రాల్లో 57 రైళ్లను మరో 6 నెలల పాటు హాల్టింగ్ సదుపాయాన్ని పొడిగించారు. ప్రయాణికుల డిమాండ్‌, ప్రజా ప్రతనిధుల నుంచి వచ్చిన అభ్యర్థనలు, సూచనల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పలు రైళ్లను కొన్ని స్టేషన్లలో ఆపుతున్నారు. ప్రయాణికుల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ రైళ్లకు హాల్టింగ్ సదుపాయం కల్పించారు. తగినంత ప్రయాణికులు లేకపోవడంతో హాల్టింగ్‌ రద్దు చేస్తారని కొద్ది నెలల క్రితం ప్రకటించారు. తాజాగా ప్రజల అభ్యర్థనలతో మరో ఆరు నెలలు ఈ సదుపాయాన్ని పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ప్రయాణికుల సౌకర్యార్థం 57 రైళ్లకు ఎంపిక చేసిన రైల్వేస్టేషన్లలో ప్రయోగాత్మక హాల్టింగ్‌ సదుపాయాన్ని పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ వెల్ల డించింది. ఈ నిర్ణయం ఫిబ్రవరి నుంచి 6 నెలల పాటు అమల్లో ఉంటుందని మంగళవ...