భారతదేశం, ఫిబ్రవరి 8 -- యంగ్ హీరో అక్కినేని అఖిల్‍కు 'ఏజెంట్' చిత్రం పీడకలలా మిగిలిపోయింది. తన కెరీర్లో తొలి హిట్ ఇస్తుందనుకొని కొండంత ఆశ పెట్టుకున్న ఈ మూవీ అల్ట్రా డిజాస్టర్ అయింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 ఏప్రిల్‍ 28న థియేటర్లలో రిలీజైంది. స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఏజెంట్ నెగెటివ్ టాక్‍తో భారీ ప్లాఫ్‍గా నిలిచింది. అయితే, ఈ మూవీ థియేటర్లలో విడుదలై దాదాపు 21 నెలలు గడుస్తున్నా ఓటీటీ స్ట్రీమింగ్‍కు మాత్రం ఇంకా అడుగుపెట్టలేదు. ఆ వివరాలు ఇవే..

ఏజెంట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ తొలుత సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకొస్తామని 2023 సెప్టెంబర్‌లోనే ఓ డేట్ చెప్పింది. కానీ స్ట్రీమింగ్‍కు రాలేదు. ఆర్థిక వివాదం కారణంగా స్ట్రీమింగ్‍కు రాలేదేమోననే రూమర్లు వచ్చాయి. అలాంట...