భారతదేశం, ఏప్రిల్ 12 -- Tollywood: కొత్త కాంబినేష‌న్ల ప‌ట్ల ప్రేక్ష‌కుల్లో ఎప్పుడు ఆస‌క్తి ఉంటుంది. డిఫ‌రెంట్ ఇమేజ్‌లు ఉన్న హీరో, ద‌ర్శ‌కుడి క‌ల‌యిక‌లో సినిమా అంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఆ సినిమా ఎలా ఉండ‌బోతుందో అనే ఆస‌క్తి అనౌన్స్‌మెంట్ నుంచే ఆడియెన్స్‌లో మొద‌ల‌వుతుంది. కాంబినేష‌న్స్‌తోనే సినిమాపై అంచ‌నాలు రెట్టింపు అవుతాయి. టాలీవుడ్‌లో ఊహించ‌ని కాంబినేష‌న్స్ కొన్ని కుదిరాయి. అవి ఏవంటే?

కోలీవుడ్ వెర్స‌టైల్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి, పూరి జ‌గ‌న్నాథ్ క‌ల‌యిక‌లో ఓ మూవీ రాబోతుంది. ఇటీవ‌లే ఈ మూవీని ఆఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. ఈ పాన్ ఇండియ‌న్ మూవీని ఛార్మితో క‌లిసి పూరి జ‌గ‌న్నాథ్ స్వ‌యంగా నిర్మించ‌బోతున్నాడు. విజ‌య్ సేతుప‌తి మూవీలో ట‌బు ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది. ఈ సినిమాకు బెగ్గ‌ర్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగ...