భారతదేశం, ఫిబ్రవరి 12 -- లాంగ్ గ్యాప్ త‌ర్వాత త‌ల మూవీతో డైరెక్ట‌ర్‌గా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు కొరియోగ్రాఫ‌ర్ అమ్మ రాజ‌శేఖ‌ర్‌. ఈ మూవీతో అమ్మ రాజ‌శేఖ‌ర్ త‌న‌యుడు రాగిన్ రాజ్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఫిబ్ర‌వ‌రి 14న త‌ల సినిమా రిలీజ్ కాబోతోంది. అంకిత నస్కర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో రోహిత్, ఎస్తేర్ నోర‌న్హా, ముక్కు అవినాష్, సత్యం రాజేష్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

త‌ల మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ ఈవెంట్‌కు డైరెక్ట‌ర్ వీఎన్ ఆదిత్య, సీరియ‌ల్ యాక్ట‌ర్ ప్ర‌భాక‌ర్‌తో పాటు ప‌లువురు గెస్ట్‌లుగా వ‌చ్చారు. ఈ ప్రీ రిలీజ్ వేడుక‌లో ఈవెంట్‌లో అమ్మ రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ.. త‌ల నాకు ఛాలెంజింగ్ మూవీ. లైఫ్ లో చాలా స్ట్రగుల్స్‌ చూశాను. ఆ టైమ్ లో అమ్మ రాజశేఖర్ కు ఏమైంది అన్ని ప్రశ్నించ...