భారతదేశం, జూలై 29 -- పులులు రాజసం ఉన్న జీవులు. నడకలో ఠీవి, పంజాలో శక్తిని ప్రతిబింబిస్తాయి. ఈ గంభీరమైన వేటాడే జంతువులను వాటి సహజ ఆవాసాలలో చూడటం అద్భుతమైన అనుభవం. వన్యప్రాణుల అభయారణ్యాల్లోని పచ్చని చెట్లలో వాటి విలక్షణమైన చారలు, మెల్లని కదలికలు అందంగా కనిపిస్తాయి. అదృష్టవంతులు మాత్రమే అడవిలో ఈ జీవులను చూడగలరు. వాటిని చూసేందుకు గంటల తరబడి జనం క్యూ కడుతుంటారు.

ఈరోజు అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దశాబ్దం క్రితం పులుల సంఖ్య ఎంత తక్కువగా ఉండేదో తెల్సుకోవాలి. వేటగాళ్ల బారిన పడి ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య తగ్గిపోయింది. ఈ క్రూరత్వానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా గళం వినిపిస్తున్న నేపథ్యంలో, అంతర్జాతీయ పులుల దినోత్సవం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ ఆకర్షణీయమైన జంతువులను వాటి ఆవాసాలలో సంరక్షించడం, వాటిని అంతరించిపోకుండా రక్షించాల్స...