భారతదేశం, ఏప్రిల్ 22 -- బిగ్‌బాస్ ఫేమ్ ఇన‌యా సుల్తానా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తెలుగు మూవీ న‌ట‌ర‌త్నాలు థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. సోమ‌వారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో ఇనయా సుల్తానాతో పాటు టాలీవుడ్ క‌మెడియ‌న్లు రంగ‌స్థ‌లం మ‌హేష్, సుద‌ర్శ‌న్, తాగుబోతు ర‌మేష్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ తెలుగు మూవీకి శివ‌నాగు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

సినిమా క‌ష్టాల‌కు మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ ఎలిమెంట్స్ జోడించి న‌ట‌ర‌త్నాలు మూవీని తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. గ‌త ఏడాది మే నెల‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌లేక‌పోయింది. బంగార్రాజు(అర్జున్ తేజ్‌), వ‌ర‌ప్ర‌సాద్‌(సుద‌ర్శ‌న్‌), పీకే నాయుడు(రంగ‌స్థ‌లం మ‌హేష్‌) ప్రాణ స్నేహితులు. బంగార్రాజు హీరో కావాల‌ని ...