భారతదేశం, ఫిబ్రవరి 22 -- Thriller OTT: తెలుగు సైక‌లాజిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ హిడింబ థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాదిన్న‌ర త‌ర్వాత మ‌రో ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఇప్ప‌టికే ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో కూడా తెలుగు వెర్ష‌న్‌లోనే హిడింబ విడుద‌లైంది.

ఈ తెలుగు మూవీలో అశ్విన్ బాబు, నందితా శ్వేత హీరోహీరోయిన్లుగా న‌టించారు. హిడింబ మూవీకి అనిల్ క‌న్నెగంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 2023 జూలైలో ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది.

మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్న‌ది. మూడు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ ఐదున్న‌ర కోట్ల వ‌ర‌కు గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సొంతం చేసుకున్న‌ది.

న‌ర‌మాంస‌భ‌క్ష‌కులు నేటి స‌మాజంలోకి వ‌స్తే ఏం జ‌రుగుతుంది అనే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు అనిల్ క‌న్నెగంటి హిడింబ మూవీని...