భారతదేశం, ఫిబ్రవరి 23 -- Thriller Movie: బిగ్‌బాస్ సీజ‌న్ 8 కంటెస్టెంట్ ఆదిత్య ఓం హీరోగా న‌టిస్తోన్న బంధీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. సింగిల్ క్యారెక్ట‌ర్‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీని ఫిబ్ర‌వ‌రి 28న రిలీజ్ కానుంది.

థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందుతోన్న ఈ మూవీకి తిరుమ‌ల ర‌ఘు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ గల్లీ సినిమా బ్యానర్ మీద వెంకటేశ్వర రావు దగ్గు తో క‌లిసి ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే బంధీ మూవీ నేష‌న‌ల్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో స్క్రీనింగ్ అయ్యింది. అవార్డులను సొంతం చేసుకుంది.

దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ నేపథ్యంతో కూడిన థ్రిల్లర్ మూవీగా బంధీ నిలుస్తుంద‌ని మేక‌ర్స్ చెబుతోన్నారు. ఈ సినిమాలో ఆదిత్య ఓం ఎదుర్కొనే పరిస్థితులు, వాతావరణ సమస్యలపై అత‌డు పోరాడే తీరు ఉత్కంఠ‌ను పంచుతుంద‌ని అంటున్నారు.

అటవీ ప్రాంతంలో రియల్ లొకేషన్స్ మధ్య...