భారతదేశం, మార్చి 16 -- నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‍లో వస్తున్న 'ది ప్యారడైజ్' సినిమాపై హైప్ ఎక్కువగా ఉంది. ఇటీవల వచ్చిన ఒక్క గ్లింప్స్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఈ మూవీ ఎంత రస్టిక్‍గా, వైలెంట్‍గా ఉండనుందో గ్లింప్స్‌తో అర్థమైపోయింది. అందులోనూ గ్లోబల్ రేంజ్‍లో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇంత క్రేజ్ ఉన్న ది ప్యారడైజ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు అప్పుడే అమ్ముడయ్యాయనే సమాచారం బయటికి వచ్చింది.

ది ప్యారడైజ్ సినిమా ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు దాదాపు రూ.65కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం వెల్లడైంది. అయితే, ఏ ఓటీటీ తీసుకుందనేది స్పష్టంగా సమాచారం బయటికి రాలేదు. అయితే, నెట్‍ఫ్లిక్స్ ఓటీటీనే తీసుకుందని తెలుస్తోంది. అలాగే, ఈ చిత్రం ఆడియో హక్కులు రూ.18కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం.

ది ప్యారడైజ్ మూవీ షూటిం...