భారతదేశం, ఫిబ్రవరి 24 -- బాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ 'ది కేరళ స్టోరీ 2' సినిమా ఒక ప్రాపగాండా మూవీ అని మరోసారి కుండబద్దలు కొట్టాడు. ఇటీవల కేరళలో జరిగిన 'ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డ్స్' వేడుకల సందర్భంగా మీడియాతో మాట్లాడిన అతడు.. బీఫ్ పరోటా (Beef parotta) చాలా అద్భుతంగా ఉంటుందని ప్రశంసించాడు. అలాగే త్వరలో విడుదల కానున్న ఈ వివాదాస్పద సినిమాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ.. అదొక బుల్ షిట్ ట్రైలర్ అని తేల్చి చెప్పాడు.

కేరళలో మీడియాతో మాట్లాడిన అనురాగ్ కశ్యప్.. "బీఫ్ పరోటా ఇక్కడ బెస్ట్" అని పేర్కొన్నాడు. మీరు కేవలం కేరళ పరోటా గురించి మాత్రమే మాట్లాడుతున్నారా అని విలేకరులు అడిగినప్పుడు.. అతడు మరింత స్పష్టత ఇస్తూ "బీఫ్ పరోటా. బీఫ్ పరోటా అనేది ఎప్పుడూ బెస్ట్" అని బదులిచ్చాడు.

మీకు బీఫ్ (గొడ్డు మాంసం) ఇష్టమా అని అడిగిన ప్రశ్నకు కూడా అత...