భారతదేశం, ఫిబ్రవరి 7 -- చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూసిన 'తండేల్' చిత్రం వచ్చేసింది. యువ సామ్రాట్ నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయిపల్లవి జోడీగా నటించిన ఈ సినిమా నేడు (ఫిబ్రవరి 7) థియేటర్లలో రిలీజైంది. శ్రీకాకుళం మత్స్యకారుడి నిజజీవిత కథతో డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రంపై ఆరంభం నుంచి ఆసక్తి ఎక్కువగా ఉంది. పాకిస్థాన్ జైలులో కొన్ని నెలల పాటు చిత్ర హింసలు అనుభవించి మళ్లీ భారత దేశానికి తిరిగి వచ్చిన శ్రీకాకుళం మత్య్సకారుల రియల్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. నేడు ఈ మూవీని చూసిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్ ఎక్స్ (ట్విట్టర్)లో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ చిత్రానికి టాక్ ఎలా వస్తోందంటే..

తండేల్ సినిమాలో నాగచైతన్య యాక్టింగ్ అదిరిపోయిందని చాలా మంది పోస్టులు చేస్తున్నారు. సాయిపల్లవి ఎప్పటిలాగే చాలా బా...