Hyderabad, ఫిబ్రవరి 24 -- Thandel OTT Release Date: తండేల్ మూవీ ఓవైపు బాక్సాఫీస్ దగ్గర ఇంకా మంచి కలెక్షన్లు సాధిస్తుండగానే ఆ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై తాజాగా మరో బజ్ నెలకొంది. ఈ సినిమా వచ్చే నెలలో ఓటీటీలోకి రావడం ఖాయమైనా కచ్చితమైన తేదీ ఇదే అంటూ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.

నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన తండేల్ మూవీ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ ఓటీటీ మార్చి 14 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. గతంలో మార్చి 6 నుంచే సినిమా రావచ్చన్న వార్తలు వచ్చినా.. తాజాగా మార్చి 14 ఖాయం అన్నట్లుగా చెబుతున్నారు.

ఈ సినిమా హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.50 కోట్లకు సొంతం చేసుకుంది. నాగ చైతన్య సినిమాల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని భాషల హక్...