భారతదేశం, మార్చి 12 -- తండేల్ తో థియేటర్లను కుమ్మేసిన రాజు- బుజ్జితల్లి ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోనూ దుమ్ముదులుపుతున్నారు. నాగచైతన్య-సాయిపల్లవి కలిసి నటించిన తండేల్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఈ లవ్ థ్రిల్లర్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ అభిమానులు ఈ మూవీని ఓటీటీలో ఎంజాయ్ చేస్తున్నారు. అయిదు భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

థియేటర్లలో వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా తండేల్ నిలిచింది. ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజైన ఈ మూవీలో నాగచైతన్య-సాయిపల్లవి కెమిస్ట్రీ మరో లెవల్ లో ఉంది. ఈ ఇద్దరి మధ్య లవ్, ఎదురు చూపులు, విరహం, కన్నీళ్లు.. పాకిస్థాన్ జైల్లో దేశభక్తి సన్నివేశాలు.. క్లైమాక్స్ ఇలా అన్న...