భారతదేశం, ఫిబ్రవరి 17 -- TGSRTC Offer : తెలంగాణ నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. బెంగళూరు వెళ్లే ప్రయాణికుల టికెట్ ధరలో 10 శాతం రాయితీని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం కల్పిస్తోంది. బెంగళూరు రూట్ లో నడిచే అన్ని సర్వీసుల్లోనూ రానుపోనూ జర్నీలకు ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ రాయితీ వల్ల ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ.160 ఆదా అవుతుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ రూట్ లో టికెట్ల ముందస్తు రిజర్వేషన్ కోసం http://tgsrtcbus.in వెబ్ సైట్ ను సంప్రదించవచ్చని సూచించింది.

హైదరాబాద్, బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఎక్కువగా ఉంటారు. వీరు తరచూ ఈ నగరాల మధ్య ప్రయాణాలు చేస్తుంటారు. వీరితో పాటు ఉద్యోగ, వ్యాపారాల నిమ్మి్త్తం హైదరాబాద్, బెంగళూరు మధ్య ప్రయాణాలు చేస్తుంటారు. తెలంగాణలో చెందిన లక్షల మంది బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్య...