తెలంగాణ,హైదరాబాద్, జనవరి 30 -- గ్రూప్-I మెయిన్ పరీక్షల మూల్యాంకనాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి చేసింది. గతేడాది నవంబర్ మాసంలోనే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కాగా..తాజాగా ఈ ప్రక్రియను ముగించినట్లు తెలిసింది.

మూల్యాంకన ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో మెరిట్ జాబితాపై టీజీపీఎస్సీ ఫోకస్ పెట్టింది. ఒక్క పోస్టుకు ఇద్దరిని ఎంపిక చేసి వారి ధ్రువపత్రాలను పరిశీలించనుంది.

అయితే గ్రూప్ 1 ఫలితాలు వచ్చిన తర్వాత మిగతా పరీక్షల తుది ఫలితాలను ఇవ్వాలని టీజీపీఎస్సీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మూల్యాంకన ప్రక్రియలో సీనియర్ ప్రొఫెసర్ల సేవలను వినియోగించుకుంది. ఫిబ్రవరి రెండో వారంలోపు మెరిట్ లిస్ట్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఆ దిశగా కమిషన్ కసరత్తు చేస్తోంది.

గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. ఇందుకు 21,151 మంద...