భారతదేశం, జనవరి 14 -- గ్రూప్‌-3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. నియామక పత్రాలను అందజేసేందుకు ముహుర్తం ఫిక్స్ చేసింది. ఈ నెల 16వ తేదీన హైదరాబాద్‌లోని మాదాపూర్‌ శిల్పకళా వేదికలో వీటిని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.

ఇటీవలనే తెలంగాణ గ్రూప్‌-3 తుధి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. 1,370 మంది అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లతో కూడిన ప్రొవిజినల్‌ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ పరీక్షలను గతేడాది నవంబర్‌ 17, 18 తేదీల్లో నిర్వహించారు. మొత్తం 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 50.24 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు.

పరీక్షల నిర్వహణ తర్వాత వీ...