భారతదేశం, ఫిబ్రవరి 12 -- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారుడి బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా డబ్బులు కట్ అయ్యే విధానం తీసుకురావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ నేపథ్యంలో అనేక వార్తలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో వాహనదారుడి బ్యాంక్ ఖాతా వివరాలను సేకరిస్తున్నారంటూ పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ వార్తలకు చెక్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ అయ్యేలా చేసే విధానం ఏదీ ప్రస్తుతం అమలులో లేదని స్పష్టం చేసింది.

ట్రాఫిక్ చలానాల కోసం వాహన రిజిస్ట్రేషన్ నంబర్లను లేదా యజమానుల బ్యాంక్ ఖాతాలను అనుసంధానం చేసి, డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ అయ్యేలా చేసే విధానం ఏదీ ప్రస్తుతం అమలులో లేదు. ఈ విషయాన్ని వాహనదారులు గమనించాలని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ కె. ...