తెలంగాణ,హైదరాబాద్, జనవరి 29 -- రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సర్వే జరిగిన తీరుతో పాటు ముసాయిదా రూపకల్పనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందన్నారు. జాతీయ స్థాయిలో సర్వే ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు. సర్వే విజయవంతంగా చేపట్టిన అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు.

ఈ సమావేశంలో ప్రధానంగా సమగ్ర కుటుంబ సర్వే ముసాయిదాపై చర్చించారు. సర్వే కు సంబంధించిన ముసాయిదా సిద్దమయిందని అధికారులు చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో సమర్పిస్తామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి నివేదికను ఫిబ్రవరి 2వ తేదీ లోగా కేబినెట్ సబ...