భారతదేశం, మార్చి 18 -- తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది. ప్రత్యేక స్వయం ఉపాధి పథకాన్ని ప్రకటించింది. "రాజీవ్ యువ వికాసం" అనే పథకాన్ని ప్రారంభించింది. దీని కోసం రూ.6,000 కోట్ల బడ్జెట్ ఉంటుందని.. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది యువతకు ప్రయోజనం చేకూరుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 17

దరఖాస్తుకు గడువు: ఏప్రిల్ 5

ఎంపిక, ధృవీకరణ: ఏప్రిల్ 6 నుంచి మే 31

తుది లబ్ధిదారుల జాబితా ప్రకటన: జూన్ 2 (తెలంగాణ నిర్మాణ దినోత్సవం)

1.మొదట అధికారిక పోర్టల్‌ tgobmms.cgg.gov.in కు వెళ్లాలి.

2.హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న రాజీవ్ యువ వికాసం లింక్‌పై క్లిక్ చ...