భారతదేశం, ఏప్రిల్ 7 -- తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం ప్రవేశపెట్టిన పథకం రాజీవ్ యువ వికాసం. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాల వారికి ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ పథకం ద్వారా యువత సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రభుత్వం రాయితీలు, బ్యాంకు రుణాల ద్వారా సహాయం చేస్తుంది. ఈ స్కీమ్‌కు మంచి స్పందన వస్తోంది. వాస్తవానికి ఈనెల 4తో గడువు ముగియాల్సి ఉంది. కానీ 14 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. మరో వారం రోజుల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆదివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖలకు కలిపి మొత్తం 9 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 14 వరకు మొత్తం 20 లక్షల అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పథకానికి అప్లై చేసేందుకు మీ సేవ కేంద్రాలు, ఇంటర్ నెట్ సెంటర్లకు లబ్ధిదారులు పోటెత్తుతున్నారు. కొత్త క్యాస్ట్, ఇన్ కమ...