భారతదేశం, జనవరి 15 -- రాష్ట్రంలో కొత్తగా సర్పంచ్ లు ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇప్పటికే వారంతా ప్రమాణస్వీకారాలు చేయటంతో బాధ్యతలు కూడా స్వీకరించారు. అయితే కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లకు శిక్షణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 21 వరకు శిక్షణ తరగతులు నిర్వహించనుంది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా వీటిని పూర్తి చేస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి.

ఇటీవలే జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 12,702 గ్రామాలకు నూతనంగా సర్పంచులు ఎన్నికయ్యారు. వీరందరికీ శిక్షణ ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, నిధుల పంపిణీ నిబంధనలతో పాటు పలు అంశాలపై అవగాహన కల్పిస్తారు. వీరికి శిక్షణ ఇచ్చే అధికారులు, సిబ్బందిని కూడా నియమించ...