భారతదేశం, ఫిబ్రవరి 11 -- తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. సా.5 గంటల్లోపు క్యూలో ఉన్నవారికి ఓటువేసే అవకాశం ఉంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్‌ జరిగింది. ఫిబ్రవరి 13వ తేదీన 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది.

నిజామాబాద్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు ఎంపీ ధర్మపురి అర్వింద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పోలింగ్ కేంద్రం నుంచి బీజేపీ అభ్యర్థిని బయటకు పంపారంటూ ఎంపీకి కార్యకర్తలు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న అర్వింద్ అక్కడి ఎన్నికల సిబ్బంది, పోలీసులపై ఫైర్ అయ్యారు.

మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ మందకొడిగా సాగుతోందని ఎస్‌ఈసీ రాణికుముదిని చెప్పారు. వందశాతం వెబ్‌ కాస్టింగ్‌తో పోలింగ్‌ జరుగుతోందని తెలిపారు. సాయంత్రానికి ...