భారతదేశం, ఫిబ్రవరి 28 -- తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు దక్కే అవకాశం ఉంది. దీంతో పార్టీ సీనియర్ నేతలంతా ఎమ్మెల్సీ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అయితే.. వారిలో అగ్రకులాలకు చెందిన నాయకులు ఎక్కువమంది ఉన్నారనే టాక్ ఉంది. వారు లాబీయింగ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీలోని బీసీ లీడర్లు ఆలర్ట్ అయ్యారు. సామాజిక సమీకరణాల ఆధారంగానే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కులగణన చేయడంతో బీసీల లెక్కలు తేలాయని అంటున్నారు. బీసీలు 56 శాతం ఉండడంతో.. ఆ ప్రాతిపదికనే సీట్లు కేటాయించాలనే డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే.. అంజన్ కుమార్ యాదవ్, తీన్మార్ మల్లన్న వంటి నేతలు స్వరం పెంచి మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపు కాంగ్రెస్ హైకమా...