భారతదేశం, ఏప్రిల్ 15 -- తెలంగాణలో కొన్ని నెలలుగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిలిచిపోయాయి. ఇకనుంచి మాత్రం నోటిఫికేషన్లు ఒక్కొక్కటిగా విడుదల కానున్నాయి. ఎస్సీ వర్గీకరణ చట్టం రావడంతో.. జాబ్​ క్యాలెండర్​ను ప్రభుత్వం రీషెడ్యూల్​ చేయాలని నిర్ణయించింది. దీంతో గ్రూప్​ 1,2,3,4 పోస్టులతోపాటు.. పోలీస్, గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డుల నుంచి నోటిఫికేషన్‌లు వెలువడనున్నాయి.

ఎప్పుడు ఏ పరీక్షలు నిర్వహించాలనే దానిపై త్వరలోనే ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. ఇందుకోసం మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. 2024-25 కోసం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌లో మొత్తం 20 నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే.. సుప్రీంకోర్టు 2024 ఆగస్టు ఫస్ట్ నాటి తీర్పు తర్వాత ఎస్సీ ఉప వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త జాబ్ నోటిఫికేషన్లను...